కరోనాతో తమిళనాడు సీఎం పర్సనల్ సెక్రటరీ మృతి

కరోనాతో తమిళనాడు సీఎం పర్సనల్ సెక్రటరీ మృతి

చెన్నై: తమిళనాడు చీఫ్​ మినిస్టర్​ పళనిస్వామి ప్రైవేట్​​ సెక్రటరీ బీజే దామోదరన్​ (56)​ కరోనాతో చనిపోయారు. వారం క్రితం దగ్గు, జలుబు, జ్వరంతో ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో జాయిన్​ దామోదరన్​​కు కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్ అని​ తేలింది. దీంతో ఆయనను స్పెషల్​ హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​ చేశారు. అక్కడ పరిస్థితి విషమించి బుధవారం చనిపోయారు. సీఎంఓలో ఐఏఎస్​లతో కలిసి మొత్తం 200 వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఆఫీస్​ను తాత్కాలికంగా మూసివేసి శాటిటేషన్​ చేస్తున్నారు. దామోదరన్​ మృతికి పళనిస్వామి సంతాపం తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్​లో ఒకరికి గవర్నమెంట్​ ఉద్యోగమిస్తామని ప్రకటించారు.

 ఢిల్లీ హెల్త్​ మినిస్టర్​కు పాజిటివ్​

ఢిల్లీ హెల్త్​ మినిస్టర్​ సత్యేందర్​ జైన్​కు కరోనా పాజిలివ్​ వచ్చింది. జ్వరం ఎక్కువగా ఉండడంతో ఆయనకు బుధవారం రెండోసారి టెస్ట్​చేశారు. మంగళవారం ఆయనకు నెగిటివ్​ అని తేలింది.

ఆప్​ ఎమ్మెల్యే అతీషికి కూడా

ఆప్​ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అతీషికి కరోనా పాజిటివ్​తేలింది. దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉండడంతో రెండు రోజుల కిందట ఆమె కరోనా టెస్ట్​ చేయించుకోగా బుధవారం రిపోర్ట్​ వచ్చింది. ప్రస్తుతం ఆమె హోమ్​ క్వారంటైన్​లో ఉన్నారు. కరోనా కట్టడి కోసం అతీషి తీవ్రంగా శ్రమిస్తున్నారని, ఆమె త్వరగా కోలుకోవాలని సీఎం కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు.