తమిళ జంట వెరైటీ రిసెప్షన్ 

తమిళ జంట వెరైటీ రిసెప్షన్ 

చెన్నై: దేశంలోనే తొలిసారి మెటావర్స్​ పద్ధతిలో వివాహ రిసెప్షన్ నిర్వహించడానికి ఓ జంట సిద్ధమైంది. తమిళనాడులోని ఐఐటీ మద్రాస్ లో ప్రాజెక్టు అసోసియేట్ గా పని చేస్తున్న టెక్నికల్ ఎక్స్ పర్ట్ దినేష్, జనగనందిని ఫిబ్రవరి 6న వివాహం చేసుకోనున్నారు. తమిళనాడులో శివలింగాపురంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే రిసెప్షన్ ను మాత్రం ఈ జంట వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బంధువులు, మిత్రులు ‘మెటావర్స్’ అనే వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా హాజరయ్యేలా ఈ వేడుకను నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ జంట ఈ మధ్యే తమ ‘అవతార్’ల ద్వారా కలుసుకున్న రిహార్సల్ వీడియోను దినేష్ సోషల్ మీడియాలో ఉంచారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇండియాలో ఇలాంటి మెటావర్స్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. కానీ అమెరికాలో ఇప్పటికే ఓ జంట మెటావర్స్‌లో పెళ్లి చేసుకుంది. వారే ట్రేసీ, డేవ్ గాగ్నన్. ఓ పక్క మామూలుగా పెళ్లి జరుగుతున్నప్పటికీ, వారు మెటావర్స్‌లో కూడా ఒకేసారి వివాహాన్ని జరిపించారు. ప్రస్తుతం దినేష్, జనగనందిని మెటావర్స్ రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను బ్లాక్ చైన్ టెక్నాలజీలో పని చేస్తున్నానని.. మెటావర్స్ కు అదే మూలం కావడంతో ఆ పద్ధతిలో యూజర్లంతా వర్చువల్ గా కలుసుకుని, డిజిటల్ అవతార్ లతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. మెటావర్స్ లో ఆగ్మెంటెడ్ రియాల్టీ, బ్లాక్ చైన్, వర్చువల్ రియాల్టీ కలగలసి ఉంటాయి. ఈ రంగంలోని ఒక అంకుర సంస్థతో కలసి దేశంలోనే తొలిసారిగా మెటావర్స్ పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా దినేష్ ప్రకటించాడు. 

మరిన్ని వార్తల కోసం:

నేనేం ప్లాస్టిక్‌‌ బొమ్మను కాదు

కెప్టెన్సీ వద్దని ఎవ్వరూ అనరు

పాత బండ్లపై 5 శాతమే జీఎస్టీ వసూలు చేయండి