చెన్నైకి తప్పని వరద కష్టాలు

చెన్నైకి తప్పని వరద కష్టాలు

చెన్నైకి వరద కష్టాలు తప్పటం లేదు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి... ఇంకా చాలా   ప్రాంతాలు వరద  నీటిలోనే ఉన్నాయి. ఎక్కడ చూసినా నీరే ఉండటంతో  జనం తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. ఇంట్లోని నిత్యవసర వస్తువులు  తడిచిపోవటంతో  సర్కార్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అటు వర్షాల  కారణంగా  చెన్నై సిటీలోని  మూసివేసిన సబ్ వేలను ఓపెన్  చేశారు. భారీ పంపులు  ఏర్పాటు చేసి  సబ్ వేలు, లోతట్టు ప్రాంతాల  నుంచి నీటిని తొలగిస్తున్నారు.

వరద ప్రభావిత  ప్రాంతాలపై   సమీక్ష నిర్వహించారు  సీఎం స్టాలిన్. లోతట్టు ప్రాంతాల నుంచి   నీటి తొలగింపు, ముంపు ప్రాంత   ప్రజల తరలింపు పనులను అడిగి   తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్   స్పీడప్ చేయాలని ఆదేశించారు. మరోవైపు  చెన్నైతో పాటు, కంచిపురం, తిరువల్లూర్, చింగల్ పేట్ జిల్లాలకు వర్ష సూచన  చేసింది వాతావరణ శాఖ.