పోస్టాఫీసుల్లో జెండాల విక్రయం

పోస్టాఫీసుల్లో జెండాల విక్రయం

భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే  ప్రధాని మోడీ ‘హర్ ఘర్ తిరంగా’ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని దేశ ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో దీంతో పోస్టాఫీసుల్లోనూ జాతీయ జెండాలను విక్రయిస్తోంది. అందులో భాగంగా కోయంబత్తూర్ లోని అన్ని పోస్టాఫీసుల్లోనూ త్రివర్ణ పతాకాల విక్రయాలను ప్రారంభించారు. ఈ మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సేవలందిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

అంతే కాకుండా ఆగష్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండాను ఎగరవేయాలని ప్రధాని మోడీ ఇటీవల జరిగిన మన్ కీ బాత్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జెండాలను ఇంటి వద్దకే పంపించేలా పోస్టల్ డిపార్ట్ మెంట్ ఆగష్టు 1 నుంచి జెండా విక్రయాలను మొదలుపెట్టింది. మార్కెట్లోనూ జాతీయ జెండాకు డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచిన జెండాలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.