తమిళనాడులో నిలిచిపోనున్న వ్యాక్సినేషన్

తమిళనాడులో నిలిచిపోనున్న వ్యాక్సినేషన్
  • వ్యాక్సిన్ నిల్వలు 5 లక్షలు మాత్రమే ఉన్నాయంటున్న తమిళనాడు
  • స్టాక్ వచ్చే వరకు నిలిపివేయాల్సి వస్తోందని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాక్సినేషన్ ఏ క్షణంలోనైనా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కేవలం 5 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయట. అవి రేపు
లేదా ఎల్లుండి కంతా అయిపోతే ఆ తర్వాత ఆగిపోతుందనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు హైకోర్టుకు కూడా సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో సరిపడినన్ని వ్యాక్సిన్లు
అందుబాటులో లేనందు వల్ల రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను ఆపేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

వ్యాక్సిన్ల స్టాక్ ఈనెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని, అంత వరకు స్టాక్ లేనందున నిలిపివేయక తప్పడం లేదని, వ్యాక్సినేషన్‌ను ఆపేయడం మినహా తమకు మరో మార్గం లేదని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడులో ఇప్పటి వరకు మొత్తం జనాభాలో కేవలం 87.7 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశామని, ఇందులో 45 ఏళ్లు పైబడిన వారు 75.73 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామని, యువతకు కేవలం 11.97 లక్షల వ్యాక్సిన్లు వేశామని ప్రభుత్వం ప్రకటించింది.