ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడిపినందుకు : 14 మంది డ్రైవర్ల సస్పెన్షన్

ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడిపినందుకు : 14 మంది డ్రైవర్ల సస్పెన్షన్

చెన్నై: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ సిటీ బస్సులు నడిపిన 14 మంది డ్రైవర్లను సస్పెండ్‌ చేస్తూ చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) ఉత్తర్వులు జారీ చేసింది సిటీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోను సెల్‌ఫోన్‌ మాట్లాడరాదని, విధి నిర్వహణలో ప్రయాణికులతో గొడవకు దిగరాదని తమిళనాడు ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయినప్పటికీ ఐదేళ్లుగా సిటీ బస్సులు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఎంటీసీకి ఫిర్యాదు చేశారు. ఆ రకంగా 2014 నుంచి 2018 డిసెంబరు వరకు అందిన 370 ఫిర్యాదులపై కేసులు నమోదుచేసి శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, తాజా ఫిర్యాదులపై చేపట్టిన విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో 14 మంది డ్రైవర్లు, ముగ్గురు కండక్టర్లను సస్పెండ్‌ చేస్తూ ఎంటీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది