తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు..

తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు..

తమిళనాడు రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నై సముద్రాన్ని తలపిప్తోంది. ఎక్కడా చూసినా వరద నీరు, బురదమయైంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ప్రజల జీవితం దెబ్బతింది. డిసెంబర్ 4న కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నగర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.  ఉంటే తమిళనాడుకు వర్షం ముప్పు తప్పడం లేదు. వచ్చే 2–-3 ( డిసెంబర్​ 11,12 తేదీలు) రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయిన ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి, కారైకల్‌లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

ఆదివారం ( డిసెంబర్​10)  తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తమిళనాడులోని తిరునల్వేలి, కూనూర్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కేరళలోని వడవత్తూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదల్లో చిక్కుకున్న చెన్నైలోని బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.6000 ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ రిలీఫ్ ఫండ్‌ని పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. ఈ సాయాన్ని 10,000కి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.