సీఎం విజయ్ వద్దే హోం, కీలక శాఖలు..తమిళనాడులో మంత్రులకు శాఖలు కేటాయింపు 

సీఎం విజయ్ వద్దే హోం, కీలక శాఖలు..తమిళనాడులో మంత్రులకు శాఖలు కేటాయింపు 

చెన్నై:  తమిళనాడు సీఎం జోసెఫ్​ విజయ్  కేబినెట్ లో మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన హోం, పోలీస్, మహిళాశిశు సంక్షేమ శాఖలను విజయ్  తన వద్దే ఉంచుకున్నారు.  పబ్లిక్, జనరల్  అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్  రెవెన్యూ ఆఫీసర్స్, ప్రత్యేక కార్యక్రమాల అమలు, యూత్  వెల్ఫేర్, వృద్ధులు వికలాంగుల సంక్షేమం, మునిసిపల్  అడ్మినిస్ట్రేషన్, అర్బన్  అండ్  వాటర్  సప్లై శాఖలు కూడా సీఎం వద్దే ఉన్నాయి. 

సీనియర్  లీడర్  కేఏ సెంగొట్టాయన్ కు ఆర్థిక శాఖ,   పెన్షన్లు,  అలవెన్సుల శాఖలు ఇచ్చారు. మంత్రి సెల్వి ఎస్  కీర్తనకు పరిశ్రమలు, పెట్టుబడులు, ఎన్. ఆనంద్ కు గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, ఇరిగేషన్.. ఆదవ్ అర్జునకు  ప్రజాపనులు, క్రీడలు, బిల్డింగ్స్, హైవేస్, మైనర్  పోర్టులు..కేజీ అరుణ్​రాజ్ కు హెల్త్, వైద్యవిద్య, ఫ్యామిలీ వెల్ఫేర్.. పి.వెంకటరమణన్ కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలను కేటాయించారు.