మోసం చేసేందుకే మోదీ టూర్ : తమ్మినేని వీరభద్రం

మోసం చేసేందుకే మోదీ టూర్ :  తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు: విభజన హామీలను అమలు చేయకుండా ప్రధాని మోదీకి రాష్ట్రంలో  పర్యటించే అర్హత లేదని సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హామీల అంశం తేల్చకుండా పర్యటించడం ఇక్కడి ప్రజలను మోసగించడమేనని ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసమే మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు వస్తున్నారని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నీమ్జ్‌‌‌‌, ఐటీఐఆర్‌‌‌‌ వంటి విభజన హామీల ఊసే కేంద్రం తీయడం లేదన్నారు.