వికారాబాద్ జిల్లా తాండూరు లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు బాలుడికి గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్, కండక్టర్, బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి వెట్లకుంటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ లోడ్, అతివేగంతో వచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ నారాయణ, కండక్టర్ యాదమ్మ, బాలుడు ఆర్యన్ కు గాయాలయ్యారు. గాయపడిన వారిని వికారాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిసతున్నారు. బస్సు ప్రమాదానికి కారణమై లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ : సిట్ విచారణకు కేటీఆర్..
ఇటీవల చేవెళ్లలో, ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మరువక ముందే తాండూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం కలవరం రేపుతోంది. పెద్ద ప్రమాదం తప్పి.. క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డారు గానీ.. జరగరానికి జరిగితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు ప్రయాణికులు.
