మలయాళ హీరోయిన్ అయినా.. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్‌తో తెలుగులోనూ గుర్తింపును తెచ్చుకుంది పార్వతి తిరువోతు. అందులో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ గెటప్‌లో ప్రేక్షకులకు కనిపించబోతోంది. విక్రమ్ లీడ్‌గా నటిస్తున్న ‘తంగలాన్’లో పార్వతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆమె గంగమ్మ పాత్ర పోషిస్తోందని రివీల్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె మహిళా రైతుగా కనిపిస్తోంది. పా రంజిత్ డైరెక్షన్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పార్వతి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతితో పాటు మాళవిక మోహనన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.