ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో తనిష్క్ టీమ్‌‌కు గోల్డ్‌‌

ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో తనిష్క్ టీమ్‌‌కు గోల్డ్‌‌

షింకెంట్: ఆసియా షూటింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో హైదరాబాద్ యంగ్ షూటర్ తనిష్క్ నాయుడు గోల్డ్‌‌, బ్రాంజ్ మెడల్‌‌తో మెరిశాడు.  గురువారం జరిగిన జూనియర్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌‌లో  తనిష్క్ నాయుడు 568 పాయింట్లతో కాంస్యం సాధించాడు. ఇదే విభాగంలో సూరజ్ శర్మ 571 పాయింట్లతో రజతం గెలుచుకున్నాడు. ఈ ఇద్దరూ నేలవల్లి ముఖేష్‌తో కలిసి టీమ్ ఈవెంట్‌‌లో 1703 పాయింట్ల స్కోరు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇక,25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో ఇండియా షూటర్లు గుర్‌‌‌‌ప్రీత్ సింగ్, అమన్‌‌ప్రీత్ సింగ్ స్వర్ణ, రజత పతకాలు అందుకున్నారు.