కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది చెరువులో రెండో విడత పూడికతీత పనులను డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి,కాంగ్రెస్టౌన్ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఐదో వార్డు పరిధిలోని చెరువు పూడికతతో నిండిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, సాగునీరు అందక రైతులు, చేపల ఉత్పత్తి లేక మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. రైతులు, ప్రజల వినతి మేరకు మంత్రి వివేక్‌వెంకటస్వామి స్పందించి రూ.12.69 లక్షల సీఎస్ఆర్ నిధులను మంజూరు చేశారు.
ఈ నిధులతో మొదటి విడతలో సుమారు 9200 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తొలగించారు. చెరువు పూర్తిస్థాయి పునరుద్ధరణ కోసం ఐదో వార్డు కౌన్సిలర్ దాముక శిరీష మరోసారి మంత్రి దృష్టికి తీసుకవెళ్లడంతో రెండో విడత పనులకు కూడా అనుమతులు మంజూరు చేశారు. పూడికతీత కార్యక్రమంలో కౌన్సిలర్శిరీష, పట్టణ మాజీ అధ్యక్షులు పల్లె రాజు, బత్తుల వేణు, నూనె శ్రీనివాస్, ఉప్పలయ్య, సదానందం, ఎల్లేష్, రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
