
సినీ నటుడు తారకరత్న పార్థివదేహానికి మంత్రి తలసాని నివాళులర్పించారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్న మంత్రి.. 40 ఏళ్ల వయసులోనే ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న 20 సంవత్సరాల వయస్సులోనే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారని, 23 సినిమాల్లో నటించారని చెప్పారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి తలసాని కోరుకుంటున్నట్టు తెలిపారు.
తారక రత్న అజాత శత్రువు అని సినీ హీరో శివాజీ అన్నారు. అందరినీ బాబాయ్ అని పిలిచే తారకరత్న మన మధ్య లేకపోవడం బాధాకరమని చెప్పారు. తనకు తారకరత్న మంచి మిత్రుడని, మంచి లీడర్ అయ్యే వాడని తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ, తారకరత్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.