విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ రిలీజ్

విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ రిలీజ్

గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు ఈ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందని అందులో స్పష్టం చేశారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్ టీం తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మయోకార్డియల్ ఇన్ఫార్షన్, కార్డియోజెనిక్ షాక్ కారణంగా తారకరత్న పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఆరోగ్య పరిస్థితి దృష్యా ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు.