తారకరత్న హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు

తారకరత్న హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు

నందమూరి  తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.  బెంగళూరులోని నారాయణ హృదాయాలయ డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. తారకరత్నకు ఎలాంటి ఎక్మో పెట్టలేదని.. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామని చెప్పారు.

ఇవాళ మధ్యాహ్నం తారకరత్నను పరామర్శించిన నందమూరి రామకృష్ణ  తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని..అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. తారకరత్న వెంటిలెటర్ పై ఉన్నారని చెప్పారు. న్యూరాలజిస్ట్ అబ్జర్వేషన్ లో ఉన్నారని  ఎక్మో పెట్టలేదన్నారు. ఎక్మో పెట్టారనేది అవాస్తవం అని చెప్పారు. తారకరత్న  సొంతంగానే ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. సిటీ స్కాన్ రిపోర్ట్ ఇంకా రాలేదన్నారు. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక మెదడు పని తీరుపై క్లారిటీ వస్తుందన్నారు. త్వరలోనే తారకరత్న నవ్వుతూ బయటకి వస్తారని..కాకపోతే ఇంకా సమయం పడుతుందన్నారు.   ఈ నెల 27 న చిత్తూరులో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న  సొమ్మసిల్లిపడిపోయిన సంగతి తెలిసిందే.