టార్పాలిన్ కవర్లు లేక రైతుల తీవ్ర అవస్థలు

టార్పాలిన్ కవర్లు లేక రైతుల తీవ్ర అవస్థలు

అకాల వర్షాలకు కల్లాల్లో ధాన్యం మొలకలెత్తుతోంది.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడం కోసం రైతులు పడరాని పాట్లుపడుతున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం మొలకెత్తకుండా టార్పాలిన్ కవర్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.  సబ్సిడీ టార్పాలిన్ కవర్ల సమస్య మొదక్ జిల్లా వ్యాప్తంగా ఉంది.. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కిరాయి టార్పాలిన్ కవర్ల బారం రైతులకు తడిసిమోపడవుతోంది. గత రెండు సంవత్సరాలుగా రైతులకు ఎలాంటి టార్పాలిన్ కవర్లు, వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం అందించడం లేదు.. బడ్జెట్ లేక రైతులకు టార్పాలిన్ కవర్లు అందించడం లేదని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. దీంతో కిరాయికి తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు. మార్కెట్లో  టార్పాలిన్ కవర్లు వాటి నాణ్యతను బట్టి ఒక్కో కవర్ 1700 రూపాయల నుండి 3000 వరకు ఉన్నాయి. కొంతమంది రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని అరబెట్టుకోవడానికి రోజుకు .20 రుపాయల కు  కిరాయి తీసుకుని వెళ్తున్నారు. ధాన్యం ఎండి కాంట అయ్యే సరికి ఒక్కో రైతుకు కవర్ల కిరాయి వేలలో అవుతుంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలును త్వరగా చేస్తే టార్పాలిన్ కవర్ల ఖర్చునుంచి కాపడినట్లు అవుతుందని రైతులు వాపోయారు.