
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ చేరుకున్నారు. వరుస మీటింగ్ లతో ఆయన బిజీగా గడపనున్నారు. తొలుత చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేతల లిస్టుపై చర్చించనున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది నాయకులను సంప్రదించారు.. పార్టీలో చేరేందుకు ఎవరెవరు సంసిద్ధత వ్యక్తం చేశారన్న అంశాలను చేరికల కమిటీ సభ్యులు చుగ్ కు వివరించనున్నారు.
మధ్యాహ్నం టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యల అధ్యయన కమిటీ సభ్యులతో చుగ్ భేటీ కానున్నారు. మునుగోడులో ఉన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ తీసే అవకాశముంది.
బీజేపీ చేపట్టిన ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్యక్రమంలో తరుణ్ చుగ్ పాల్గొంటారు. పార్లమెంట్ ప్రవాసీ యోజన, బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకోనున్నారు. సాయంత్రం బండి సంజయ్ పాదయాత్రలోనూ తరుణ్ చుగ్ పాల్గొంటారు.