
బండి సంజయ్ ఆరెస్ట్ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. సంజయ్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న మద్దతును చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ పాదయాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజల్లో ప్రజాదరణ తగ్గుతుందని, సంజయ్ పాదయాత్రకు ప్రజల మద్దతు పెరిగిందని అన్నారు. ప్రజాసమస్యలపై సంజయ్ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నాడని, సమస్యలు బయటకు రాకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ పతనం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాడని ఫైర్ అయ్యారు.
బండి సంజయ్ ఆరెస్ట్
ఢిల్లీ లిక్కర్ కుంభోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందంటూ కొందరు బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. అయితే దీనికి నిరసనగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.