మూడు కమిటీలతో భేటీ కానున్న తరుణ్ చుగ్

మూడు కమిటీలతో భేటీ కానున్న తరుణ్ చుగ్

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ ఇటీవల మూడు కమిటీలను నియమించింది. వీటి కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఎల్లుండి (శనివారం) రాష్ట్రానికి రానున్నారు. ఈసందర్భంగా ఆయన చేరికల కమిటీ, ఫైనాన్స్  కమిటీ, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్- వైఫల్యాల అధ్యయన కమిటీలతో భేటీ కానున్నారు. ఆయా కమిటీలు ఎటువంటి వ్యూహాలతో ముందుకుపోవాలనేది సూచించనున్నారు. కాగా, ఈటల రాజేందర్​ కన్వీనర్ ​గా ‘చేరికలపై సమన్వయ కమిటీ’ని, జితేందర్​ రెడ్డి కన్వీనర్ ​గా ‘ఫైనాన్స్​ కమిటీ’ని, ధర్మపురి అర్వింద్​ కన్వీనర్ ​గా ‘ప్రజా సమస్యలు, టీఆర్​ఎస్​ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’ని ​ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.