డేంజర్కెమికల్స్తో అల్లంవెల్లుల్లి పేస్ట్..196 కిలోలు స్వాధీనం

డేంజర్కెమికల్స్తో అల్లంవెల్లుల్లి పేస్ట్..196 కిలోలు స్వాధీనం

వికారాబాద్, వెలుగు: హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులతో తయారుచేసి విక్రయిస్తున్న అల్లంవెల్లుల్లి పేస్టును టాస్క్​ఫోర్స్​ అధికారులు పట్టుకున్నారు. వికారాబాద్​ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్ అన్వర్ పాషా టీం, తాండూర్​ పట్టణ పోలీసులు సంయుక్తంగా తాండూరు పట్టణంలో దాడులు నిర్వహించారు. మణికంఠ కిరాణా షాపులో తనిఖీలు చేయగా కల్తీ జింజర్​ పేస్ట్​ దొరికింది. 

యజమాని వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అసిఫ్ నగర్ కు చెందిన ఇమ్రాన్ సలీం దెగ్గర తీసుకొచ్చి అల్లంవెల్లుల్లి పేస్ట్​ అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​కు చెందిన ఇమ్రాన్ సలీంను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద సుమారు 196 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, 60 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 

హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడి పేస్ట్​ తయారుచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్​పీ నారాయణరెడ్డి తెలిపారు.