- బర్రెలకు ఫీడ్‌గా బాలామృతం
- అంగన్‌వాడీలకు చేరాల్సింది డెయిరీ ఫామ్స్‌కు సప్లయ్
- చంచల్‌గూడలో టాస్క్‌ఫోర్స్ దాడులు
- 130 ప్యాకెట్లు సీజ్, నిర్వాహకుడి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: చిన్నారుల పౌష్టికాహారమైన బాలామృతాన్ని బర్రెలకు ఫీడ్‌గా వేస్తున్న ముఠా గుట్టురట్టైంది. చంచల్‌గూడలోని అన్సారీ డెయిరీ ఫామ్‌పై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 130 బాలామృతం ప్యాకెట్లను సీజ్ చేశారు. వివరాలను టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ గుమ్మి చక్రవర్తి గురువారం మీడియాకు వెల్లడించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టికాహారంగా 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్లను అందిస్తున్నారు. అంగన్‌వాడీల ద్వారా వీటిని సప్లయ్ చేస్తున్నారు. చంచల్‌గూడకు చెందిన డెయిరీ ఫామ్ నిర్వాహకుడు మహ్మద్ అన్సారీ ఖాన్(50) వీటిని బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు. బర్రెలు, ఆవులకు ఫీడ్‌గా వేస్తున్నాడు. సిటీలోని అంగన్‌వాడీ స్కూళ్లు, గోదాముల నుంచి బాలామృతం ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నాడు.
టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో బర్రెలకు వేసేందుకు రెడీగా ఉంచిన 130కి పైగా బాలామృతం ప్యాకెట్లను సీజ్ చేసి, మహ్మద్ అన్సారీ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన బాలామృతాన్ని చైల్డ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు. డబీర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ మంత్రి బంధువు కావడంతోనే స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో బాలామృతం బ్లాక్‌మార్కెట్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
