ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న తేజ ఫ్యాన్

ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న తేజ ఫ్యాన్

టేస్టీ తేజ(Tasty teja).. బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన కెమెడీతో, పంచెస్ తో ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాడు. ఎలిమినేషన్ తరువాత స్టేజీపై నాగార్జున కూడా నిన్ను మిస్ అవుతాను తేజ అని అన్నారంటే హౌస్ లో తన మార్క్ ను ఎంతలా క్రియేట్ చేశాడు అర్థం చేసుకోవచ్చు. నిజానికి తేజ ఎలిమినేషన్ ను చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. 

బయటకు వచ్చిన తేజ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక ఎమోషనల్ వీడియో పెట్టాడు. ఈ వీడియోలో తేజ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తేజ ఫ్యాన్స్ ఒక ఫుడ్ డెలివరీ చేయడానికి రూమ్ కి వచ్చాడు. అక్కడ తేజను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. అన్నా నువ్వు బయటకు రావడం తక్కుకోలేకపోతున్నాను అన్నా. నువ్వు నా ఫెవరెట్ అన్నా.. నీకు ఓట్స్ కూడా వేశాను.. చాలా బాధేస్తుంది అన్నా నిన్ను ఇలా చూడటం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. అది చూసిన తేజ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. నాకోసం నువ్వు ఏడవడం ఏంటి సామీ.. ఎం అవలేదు జస్ట్ ఇంటినుండి బయటకు వచ్చాను అంటూ ఆ వ్యక్తిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. చాలా ఎమోషనల్ గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.