జనాలకు అడ్డంగా దొరికిపోతున్నావ్ రతికా.. తేజ ఇచ్చిపడేసాడుగా!

జనాలకు అడ్డంగా దొరికిపోతున్నావ్ రతికా.. తేజ ఇచ్చిపడేసాడుగా!

బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season7) ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిగతా రోజుల సంగతెలా ఉన్నా.. సోమవారం రోజు వచ్చే నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా సాగుతోంది. అందుకే ఆడియన్స్ ఈ ఎపిసోడ్ కోసం వారవారం వెయిట్ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో ఫుల్లుగా సక్సెస్ అవుతున్నారు. 

గత సీజన్స్ లో ఎన్నడూ లేనంత వాడీ వేడిగా ఈ  సీజన్ నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన నామినేషన్స్ కూడా గరం గరంగా జరుగుతున్నాయి. దీనికి సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ఆసక్తికరంగా జరిగిన ఈ నామినేషన్స్ లో సగం సోమవారం పూర్తి కాగ.. మిగిలినవి మంగళవారం జరిగాయి. ఈ ప్రోమోలో రతిక(Rathika)కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు తేజ(Tasty teja).

నామినేషన్స్ లో భాగంగా శోభా(Shobha) రతికాను నామినేట్ చేసింది. దాన్ని డిఫెండ్  చేసుకోవడానికి ప్రయత్నించిన రతికా.. మధ్యలో తేజ పేరును తీసుకొచ్చింది. దీంతో సహనం కోల్పోయిన తేజ.. మీ మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొచ్చావ్.. అంటూ రతికాతో గొడవకు దిగాడు. అంతేకాదు.. బాగా వాదిస్తున్నా అనుకుంటున్నావు కానీ.. దొరికిపోతున్నావ్.. జనాలకి దారుణంగా దొరికిపోతున్నావ్.. అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు తేజ. దీంతో ఎం మాట్లాడాలో తెలియక నోరు మూసుకుంది రతికా. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియో ఆడియన్స్ రతికా నువ్విక మారవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తేజ అన్న మాటలకి రతికా ఎలా రియాక్ట్ అయ్యిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Also Read:-గొప్ప మనసు చాటుకున్న కార్తీ.. వారికి కోటీ 25 లక్షలు సహాయం