
హైదరాబాద్, వెలుగు: మనదేశంలో ఎక్కువ మందికి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా మెడికేర్ సెలెక్ట్ పాలసీని తీసుకువచ్చినట్టు టాటా ఏఐజీ ప్రకటించింది. ఈ పాలసీ శిశువులు మొదలుకొని సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఇన్ఫినిట్ అడ్వాంటేజ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, పాలసీ కాలంలో ఒక క్లెయిమ్కు గరిష్ట పరిమితి లేకుండా కవరేజీ ఇస్తారు. డాక్టర్కన్సల్టేషన్స్, దంత సంరక్షణ, టెలికన్సల్టేషన్ వంటి ఔట్ పేషెంట్ చికిత్సలను కవర్ చేయడానికి ఓపీడీ కేర్ రైడర్ అందుబాటులో ఉంటుంది. పలు వర్గాలకు డిస్కౌంట్లు ఉన్నాయని టాటా ఏఐజీ తెలిపింది.
ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ఎగ్జిక్యూటివ్ ప్రతీక్గుప్తా మాట్లాడుతూ ‘‘ గత ఏడాదిలో 82,000 పైగా పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా రిటైల్ హెల్త్ పోర్ట్ ఫోలియోలో మూడు రెట్ల వృద్ధి సాధించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో మా కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మా నెట్వర్క్లో 1,600 పైగా ఆసుపత్రులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 16 శాతం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు.