
న్యూఢిల్లీ: నాన్–బ్యాంకింగ్ఫైనాన్షియల్కంపెనీ (ఎన్బీఎఫ్సీ) టాటా క్యాపిటల్ రూ. 15,512 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ఒక్కో షేరు ధరను రూ. 310–-326గా నిర్ణయించింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద ఇష్యూ. ప్రైస్బ్యాండ్గరిష్ట స్థాయిలో, ఈ ఎన్బీఎఫ్సీ విలువ సుమారు రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. ఇష్యూ వచ్చే నెల 6–8 తేదీల్లో ఉంటుంది. యాంకర్బుక్బిడ్డింగ్ అక్టోబర్3న జరుగుతుంది.
మొత్తం 47.58 కోట్ల షేర్లతో కూడిన ఈ ఐపీఓలో 21 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, 26.58 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉన్నాయి. కంపెనీ రూ. 15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ఓఎఫ్ఎస్ విభాగంలో, టాటా సన్స్ 23 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) 3.58 కోట్ల షేర్లను అమ్మనుంది. ప్రస్తుతం, టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 88.6 శాతం వాటా, ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది.
ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ టైర్–-1 క్యాపిటల్బేస్ను బలోపేతం చేయడానికి, అప్పులు ఇవ్వడానికి, భవిష్యత్ మూలధన అవసరాల కోసం ఉపయోగిస్తారు. టాటా క్యాపిటల్ గతంలో ఏప్రిల్‌లో కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్ మార్గంలో డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి జులైలో ఆమోదం వచ్చింది. ఈ ఐపీఓ భారతదేశ ఆర్థిక రంగంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ అవుతుంది. నవంబర్ 2023లో టాటా టెక్నాలజీస్ మార్కెట్లోకి రాగా, ఆ తరువాత టాటా గ్రూప్ నుంచి ఇది రెండో పబ్లిక్ లిస్టింగ్ అవుతుంది.
అప్పర్లేయర్ఎన్బీఎఫ్సీల లిస్టింగ్ తప్పనిసరి కావడంతో ఈ ఐపీఓ వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్‌కు రూ. 3,655 కోట్ల నికరలాభం వచ్చింది. ఐపీఓలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) కోసం, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం, మిగిలిన 15 శాతం నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు. లిస్టింగ్ అక్టోబర్ 13న జరిగే అవకాశం ఉంది.