వెస్ట్‌‌‌‌‌‌‌‌సైడ్  233వ స్టోర్‌‌‌‌‌‌‌‌ షురూ

వెస్ట్‌‌‌‌‌‌‌‌సైడ్  233వ స్టోర్‌‌‌‌‌‌‌‌ షురూ

హైదరాబాద్, వెలుగు : టాటా గ్రూపునకు చెందిన ఫ్యాషన్​ రిటైలర్​ వెస్ట్​సైడ్​ తన 233వ స్టోర్​ను హైదరాబాద్​లో ప్రారంభించింది. పంజగుట్టలోని ఈ స్టోర్ 36,288 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.  ఇక్కడ దుస్తులు, ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, పాదరక్షలు వంటి ఎన్నో ప్రొడక్టులు ఉంటాయని కంపెనీ తెలిపింది.  

వినియోగదారులకు న్యాయమైన ధరల్లో సమకాలీన,  ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్‌‌‌‌‌‌‌‌లను అందిస్తామని ప్రకటించింది.  ప్రతి మూడు వారాలకు ఒకసారి కొత్త స్టాక్​వస్తుందని వెల్లడించింది.