ఐఫోన్లు తయారు చేయబోతున్న టాటా గ్రూప్

ఐఫోన్లు తయారు చేయబోతున్న టాటా గ్రూప్

155 యేళ్ల చరిత్ర గల టాటా గ్రూప్.. ఉప్పు నుంచి టెక్నాలజీ సర్వీసెస్ వరకు వివిధ వ్యాపారాల్లో రారాజుగా నిలిచింది. తాజాగా ఐఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. భారత దేశంలోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ల కోసం యాపిల్ ఫోన్లను టాటా గ్రూప్ తయారు చేయనుంది.‘‘దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఆపిల్ ఐఫోన్ల తయారీకి టాటా గ్రూప్ ఇకపై బాధ్యత వహిస్తుందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ శక్రవారం(అక్టోబర్27)  ప్రకటించారు. దీంతో భారత్ దేశంలో ఐఫోన్లను ఉత్పత్తి చేసే మొట్ట మొదటి కంపెనీగా టాటా గ్రూప్ నిలుస్తుంది. గతంలో విస్ట్రన్ హాంకాంగ్ లిమిటెడ్ కంపెనీ నిర్వహించే కార్యకలాపాల బాధ్యతను తీసుకున్నందుకు టాటా బృందానికి అభినందనలు తెలుపుతూ రాజీవ్ చంద్ర శేఖర్ ట్వీట్ చేశారు.  

155 యేళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు విభిన్న వ్యాపారాల్లో ప్రసిద్ది చెందింది. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. తమిళనాడులో విశాలమైన ఫ్యాక్టరీలో ఐఫోన్ చాసిస్ పరికరం మెటల్ ఫ్రేమ్ వర్క్  ను తయారు చేస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ, ఎగుమతులకు సిద్దమవుతోంది. ఇది గ్లోబల్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల వృద్ధికి సంపూర్ణ మద్దతు నిస్తుంది. దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ పవర్ గా మార్చాలనే ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాకారం చేస్తుందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి అన్నారు.