మారుతీ బాటలో టాటా..చిన్న డీజిల్ కార్లు బంద్

మారుతీ బాటలో టాటా..చిన్న డీజిల్ కార్లు బంద్

న్యూఢిల్లీ : మారుతీ సుజుకి మాదిరి టాటామోటార్స్ కూడా చిన్న డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపి వేయాలని అనుకుంటున్నది. కాలుష్య నియంత్రణకు బీఎస్‌‌‌‌ 6 నిబంధనలు అమల్లోకి రాబోతుండటంతో, ఈ కార్ల ధర పెరిగి డిమాండ్ తగ్గిపోతుందని టాటా మోటార్స్ భావిస్తోంది.ఈ కారణంతో చిన్న డీజిల్ కార్లను తన పోర్ట్‌‌‌‌ఫోలియో నుంచి తీసేయాలని చూస్తున్నట్టు టాటామోటార్స్ కంపెనీ ఉన్నతాధికారులు చెప్పారు.ఇప్పటికే మార్కెట్ లీడర్‌ గా ఉన్న మారుతీ సుజుకి 2020 ఏప్రిల్ 1 నుంచి డీజిల్ మోడల్స్ విక్రయాలను నిలిపి వేయనున్నట్టు ప్రకటించింది. అదే ఏడాది నుంచి బీఎస్‌‌‌‌ 6 నిబంధనలు అమల్లోకి రాబోతున్నా యి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, డీజిల్ కార్ల కాస్ట్ పెరుగుతోంది.ముఖ్యంగా చిన్న కార్లు ఖరీదైనవిగా మారతాయి.టాటా మోటార్స్ ప్రస్తుతం తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్‌ టియాగోను 1 లీటరు డీజిల్ ఇంజిన్‌ తో విక్రయిస్తోంది. కాంపాక్ట్ సెడాన్ టిగోర్‌ ను 1.05లీటరు ఇంజిన్‌ తో, ఇతర మోడల్స్ బోల్ట్, జెస్ట్‌‌‌‌లను 1.3 లీటరు డీజిల్ ఇంజిన్‌ తో అమ్ముతోంది.తక్కువ డిమాండ్‌ తో ఎక్కువ ఖర్చులను భరిస్తూ తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్‌ ను అభివృద్ధిచేయడం సరియైనది కాదని తాము భావిస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ ప్యాసెం జర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ మయాంక్ ప్రతీక్అన్నా రు. అంతేకాక సుమారు 80 శాతండిమాం డ్‌ పెట్రోల్ వేరియంట్ల నుం చే వస్తుం దనిపేర్కొన్నా రు. బీఎస్‌‌‌‌ 6 ఇంజిన్ లు చాలా ఖరీదై న-వని, ముఖ్యం గా చిన్న డీజిల్ కార్లకు వీటి కాస్ట్ఎక్కువగా ఉంటుందని ప్రతీక్ చెప్పారు. ఈఖర్చులను చివరికి కస్టమర్లకే బదలాయించాల్సి వస్తుందని, దీంతో ఇండస్ట్రీలో డీజిల్ వెహికిల్స్ ధరలు పెరిగి అమ్మకాలు తగ్గిపోతాయని తెలిపారు.

డీజిల్‌‌‌‌ కార్లు మరింత ఖరీదు

వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా అమల్లోకి రాబోతున్న బీఎస్‌‌‌‌ 6 నిబంధనలతో డీజిల్ కార్లు చాలా ఖరీదైనవిగా మారతాయి. దీంతో భవిష్యత్తులో తమ పోర్ట్‌‌‌‌ఫోలియోల నుంచి ఈ వాహనాలను తీసేయాలని ఆటో కంపెనీలు భావిస్తున్నా యి. మారుతీ, టాటామోటార్స్ డీజిల్ కార్లను తమ పోర్ట్‌‌‌‌ఫోలియోల నుంచి తీసివేయాలని చూస్తుంటే, ఫోర్డ్ మాత్రం డీజిల్ మోడల్స్‌‌‌‌ విక్రయాలను కొనసాగిస్తా మంటూ ప్రకటించింది. డెడ్‌ లైన్‌ కు ముందే బీఎస్‌‌‌‌ 6 నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్లతో మోడల్స్‌‌‌‌ను సిద్ధం చేస్తామని చెప్పింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుం చి బీఎస్ 6 ఎమిషన్స్ నిబంధనలు అమల్లోకివస్తున్నా యి. ప్రస్తుతం దేశంలో అమ్ముడుపోతున్న వెహికిల్స్ బీఎస్ 4 ఎమిషన్స్ స్టాండర్డ్స్‌‌‌‌కుఅనుగుణంగా ఉన్నాయి.