
హైదరాబాద్,వెలుగు: టాటా మోటార్స్ తన నూతన టాటా ఏస్ ప్రో మినీ -ట్రక్‌ను హైదరాబాద్‌లో సోమవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పెట్రోల్, బై-ఫ్యూయల్ (సీఎన్‌జీ + పెట్రోల్), ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఈ మినీ-ట్రక్కు 750 కిలోల వరకు పేలోడ్ కెపాసిటీ ఉంటుంది. 6.5 అడుగుల పొడవైన డెక్ ఉండటం వల్ల వివిధ రకాల లోడింగ్ అవసరాలు తీరుతాయి. పెట్రోల్ వేరియంట్ 694 సీసీ ఇంజిన్ 30 బీహెచ్పీ పవర్‌ను, 55 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ఒక్కసారి చార్జ్‌చేస్తే 155 కిలోమీటర్ల మైలేజ్ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 1.5 గంటల్లో 80 శాతం చార్జ్ అవుతుంది.
బై-ఫ్యూయల్ వేరియంట్లో ఐదు -లీటర్ల పెట్రోల్ బ్యాకప్ ట్యాంక్ అమర్చారు. క్రాష్-టెస్ట్ పాసైన క్యాబిన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్టెన్స్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లూ ఉన్నాయి.