లాభాల్లోకి టాటా మోటార్స్

లాభాల్లోకి టాటా మోటార్స్

ముంబై: టాటా మోటార్స్​ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మార్చి 2023తో ముగిసిన క్యూ4 లో రూ. 5407.79 కోట్ల లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది నాలుగో క్వార్టర్లో కంపెనీకి రూ. 1,032.84 కోట్ల నష్టం వచ్చింది. తాజా క్యూ4 లో టాటా మోటార్స్​ ఆపరేషన్స్​ రెవెన్యూ కూడా 35.05 శాతం ఎగసి రూ. 1,05,932.35 కోట్లకు చేరింది. 2021–22 నాలుగో క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 78,439.06 కోట్లు. లాభాల బాట పట్టిన నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 చొప్పున డివిడెండ్​ను రికమెండ్​ చేసింది. ఆటోమోటివ్​ వర్టికల్స్​అన్నీ మంచి పెర్​ఫార్మెన్స్​ కనబరచినట్లు గ్రూప్​ సీఎఫ్​ఓ పీ బీ బాలాజీ చెప్పారు. భవిష్యత్​లోనూ గ్రోత్​ బాగుంటుందని, క్యాష్​ ఫ్లో మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సమీప భవిష్యత్​లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లో డిమాండ్​ పుంజుకుంటుందనే అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023–24 లో టాటా మోటార్స్​ పనితీరు ఇంకా బాగుండేలా టార్గెట్స్​ పెట్టుకున్నామని బాలాజీ అన్నారు. 

జాగ్వార్​ అండ్​ లాండ్​ రోవర్​ రెవెన్యూ 7.1 బిలియన్​ పౌండ్లు...

జాగ్వార్​ అండ్​ ల్యాండ్​ రోవర్​ క్యూ 4 రెవెన్యూ 49 శాతం పెరిగి 7.1 బిలియన్​ పౌండ్లకు చేరినట్లు టాటా మోటార్స్​ వెల్లడించింది. చిప్​ సప్లయ్​ మెరుగుపడటమే ఇందుకు కారణమని వివరించింది. నాలుగో క్వార్టర్లో అమ్మకాలు 24 శాతం అధికమై 94,649 యూనిట్లకు చేరినట్లు తెలిపింది. రిటెయిల్​ సేల్స్​ పెరగడమే కాకుండా, 2 లక్షల యూనిట్లతో ఆర్డర్​బుక్​ కూడా పటిష్టంగా ఉందని పేర్కొంది. 

కమర్షియల్​ వెహికల్స్​...

తాజా క్వార్టర్లో (మార్చి 2023) కమర్షియల్​ వెహికల్స్​ బిజినెస్​ రెవెన్యూ 14 శాతం పెరిగి  రూ. 21,200 కోట్లకు, పాసింజర్​ వెహికల్స్​ బిజినెస్​ రెవెన్యూ 15.3 శాతం ఎక్కువై రూ. 12,100 కోట్లకు చేరాయని టాటా మోటార్స్ తెలిపింది. ఏస్​ ఈవీ డెలివరీలు మొదలయ్యాయని పేర్కొంది. ​