
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తట్టుకునేందుకు తమ ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచినట్లు టాటా మోటార్స్ శనివారం తెలిపింది. వేరియంట్, మోడల్‌ను బట్టి 0.55 శాతం వరకు పెంపుదల ఉంటుంది. కొత్త ధరలు శనివారం నుండి అమలులోకి వచ్చాయి. ఇండియా మార్కెట్లో పంచ్, నెక్సాన్, హారియర్ సఫారితో సహా పలు రకాల మోడళ్లను ఈ కంపెనీ అమ్ముతోంది. టాటా మోటార్స్ ఇప్పటికే తమ కమర్షియల్ వెహికల్స్ ధరలను ఈ నెల నుంచే 1.5– 2.5 శాతం వరకు పెంచింది.