V6 News

యాప్ తో నే ఏసీ, లైటింగ్ ఆపరేట్ చేయొచ్చు..మార్కెట్లోకి టాటా పవర్ స్మార్ట్ హోమ్ డివైజ్లు

యాప్ తో నే  ఏసీ, లైటింగ్ ఆపరేట్ చేయొచ్చు..మార్కెట్లోకి టాటా పవర్ స్మార్ట్ హోమ్ డివైజ్లు

హైదరాబాద్​, వెలుగు: టాటా పవర్ తన ఈజీ హోమ్ ఆటోమేషన్ డివైజ్​లను హైదరాబాద్​ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ట్యూబ్​లైట్స్​, స్మార్ట్​ప్లగ్స్​, స్మార్ట్​లైట్స్​ వంటివి ఉన్నాయి. యాప్ ద్వారా లైటింగ్, ఏసీ, భద్రతా వ్యవస్థలను నియంత్రించవచ్చని కంపెనీ తెలిపింది. పాత ఇళ్లలో కూడా ఎలక్ట్రికల్ మార్పులు చేయకుండానే స్మార్ట్ సాకెట్లు, సెన్సార్లను అమర్చుకోవచ్చు. ఓల్టేజీ హెచ్చుతగ్గుల నుంచి గృహోపకరణాలకు రక్షణ కల్పించేలా వీటిని రూపొందించారు.  

ఈ ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా ఏటా సుమారు 15 శాతం విద్యుత్ ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది.  సాధారణ ఇండ్లకు ఏడాదికి 1,300 యూనిట్ల విద్యుత్ కలిసి రావడంతో పాటు రూ.10 వేల వరకు బిల్లు తగ్గుతుంది. ఏటా 1.1 టన్నుల సీఓ2 ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. వంద నగరాలకు స్మార్ట్ సొల్యూషన్లను అందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ సేవలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఇంటర్నెట్ లేకపోయినా ఆటోమేషన్​ వ్యవస్థ పనిచేస్తుంది.