ఉద్యోగి చనిపోతే.. రిటైర్మెంట్ వరకు నామినికి జీతం

ఉద్యోగి చనిపోతే.. రిటైర్మెంట్ వరకు నామినికి జీతం

కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని టాటా స్టీల్ ప్రకటించింది. కరోనాతో ఉద్యోగి చనిపోతే... ఆయన రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు నామినికి జీతం ఇస్తామని ప్రకటించింది. వారి కుటుంబాలకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కంటిన్యూ చేస్తామని టాటా స్టీల్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా.. కంపెనీలో ఫ్రంట్ లైన్ ఉద్యోగి మరణిస్తే వారి పిల్లలు గ్రాడ్యూయేషన్ చదువుకునే వరకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తన అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేసింది. దీంతో సోషల్ మీడియాలో టాటా స్టీల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.