కోల్బెల్ట్, వెలుగు: విద్యార్థుల్లో దాగిఉన్న క్రికెట్నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తవక్కల్ క్రికెట్అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని తవక్కల్విద్యా సంస్ధల అధినేత, డీసీసీ స్పోక్స్పర్సన్ఎంఏ అబ్దుల్ అజీజ్తెలిపారు. తవక్కల్హైస్కూల్ఆవరణలో ఏర్పాటు చేసిన అకాడమీని శుక్రవారం రాత్రి డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ వైస్చైర్ పర్సన్మిట్టపల్లి సరిత, టౌన్ఎస్సై శ్రీధర్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తవక్కల్విద్యా సంస్థలు స్థాపించిన తమ సోదరుడు అబ్దుల్మజీజ్, గురు అకాడమీ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ఆశయాల మేరకు విద్యార్థులను ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
