
ముషీరాబాద్, వెలుగు: టాక్సీ, ఆటో వాహనాలకు యూనిఫామిక్ ఫెయిర్(కిలో మీటర్ ధర) ప్రభుత్వమే నిర్ణయించాలని తెలంగాణ యాప్ బెస్ట్ డ్రైవర్స్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చిక్కడపల్లిలోని కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కమిషనర్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజుల కిరణ్, శంకర్, మహేందర్, డేవిడ్, గోపాల్, వీరయ్య, జోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.