సింగరేణి ఎన్నికల వేళ.. బీఆర్ఎస్కు షాక్.. టీబీజీకేఎస్కు అగ్రనేతల రాజీనామా!

సింగరేణి ఎన్నికల వేళ.. బీఆర్ఎస్కు షాక్.. టీబీజీకేఎస్కు అగ్రనేతల రాజీనామా!

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) ఎదురుదెబ్బ తగిలింది. యూనియన్ కు చెందిన ముగ్గురు అగ్రనేతలు రాజీనామా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. అధ్యక్షుడు బి. వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి. ప్రధాన కార్యదర్శి కేంగర్ల మల్లయ్య.. యూనియన్ కు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తమ రాజీనామా పత్రాన్ని శుక్రవారం (డిసెంబర్ 22న) మాజీ సీఎం కేసీఆర్ కు పంపించనున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లో సింగరేణి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతల రాజీనామాలతో సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కింది స్థాయి నాయకుల పరిస్థితి అయోమయంగా మారింది. గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకులకు సూచించడంతో.. ఎన్నికల్లో పోటీ చేయకపోతే యూనియన్ లో ఉండి లాభం లేదని భావించి.. రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. శుక్రవారం (డిసెంబర్ 22న) మీడియా సమావేశం నిర్వహించి యూనియన్ ను వీడనున్నట్లు సమాచారం.