టీఆర్ఎస్ మంత్రులకు సిగ్గుండాలె

టీఆర్ఎస్ మంత్రులకు సిగ్గుండాలె

ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే.. కనీసం ఎక్కరినీ కూడా స్మరించుకోకుండా బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేస్తే వాడు వీడు అంటూ టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.  టీఆర్ఎస్ తీరును ఈ ఎన్నికనే తీర్పు చెబుతుందన్నారు. సానుభూతి పేరుతో టీఆర్ఎస్ గెలిచిందని.. ఇక నుంచి ప్రజలు గుర్తించారన్నారు. సమస్యలను గుర్తించే వ్యక్తి కావాలనే రఘునందన్ ను ఎంపిక చేశామన్నారు. ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ రాత్రికి రాత్రే ఓటుకు రూ.10వేలకు పైగానే పంచారన్నారు. ఫలితం మాత్రం బీజేపీదేనని.. కోట్ల రూపాయలు పంచారన్నారు. టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకున్నా ప్రజలు మాత్రం బీజేపీకే ఓటు వేశారని చెప్పారు.

పోలీసులు కేసీఆర్ కు కొమ్ముకాశారని.. సిద్దిపేటలో జరిగిన సంఘటనపై ఏం చేశారని ప్రశ్నించారు. గెలిస్తే అవకారం రాదని.. ఓడితే నిరాశపడమన్నారు. అన్ని కేంద్రమే ఇచ్చాక నువ్వు చేసేదేమని కేసీఆర్ ను ప్రశ్నించారు బండి. కోవిడ్ పేరుతో వచ్చిన డొనేషన్ డబ్బులు ఏం చేశారన్న బండి.. హైదరాబాద్ వరద బాధితులకు రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అవి కూడా చాలా మందికి అందలేదని.. టీఆర్ఎస్ కార్యకర్తలు కక్కుర్తితో రూ.10 వేలకు కూడా కమీషన్ తీసుకోవడం సిగ్గు చేటు అన్నారు.

అకాలవర్షం రాగానే పరిశీలన అంటారు.. సర్వే అంటారు ఏ ఒక్కచోట నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. బీజేపీపై విశ్వాసంతో దుబ్బాక ప్రజలు ఓటు వేశారని.. అదే నమ్మకంతో పని చేసి చూపిస్తామన్న బండి సంజయ్.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.