
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు మెగా ప్లాన్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా, కంపెనీ 6.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 54 వేల కోట్ల) భారీ పెట్టుబడితో గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్‌ను నిర్మించనుంది.
భారతదేశంలో ఏఐ వృద్ధికి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇంత భారీ స్థాయిలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఏఐ అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు,హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరాలకు మద్దతు ఇవ్వగలమని తెలిపింది. ఇదిలా ఉంటే, టీసీఎస్ లండన్‌లో ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్, డిజైన్ స్టూడియోను ప్రారంభించింది.
రాబోయే మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 5,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వనుంది. ప్రస్తుతం టీసీఎస్‌కు యూకేలో 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో యూకే ఆర్థిక వ్యవస్థకు 3.3 బిలియన్ పౌండ్లను అందించింది. ఈ కొత్త ఏఐ హబ్, లండన్ డిజైన్ స్టూడియో టీసీఎస్ ప్లాగ్‌షిప్ పేస్‌పోర్ట్ సౌకర్యంలానూ పనిచేస్తుంది.