Last Warning: ఇంటినుంచి పనిచేస్తున్న.. ఉద్యోగులకు టీసీఎస్ చివరి హెచ్చరిక

Last Warning: ఇంటినుంచి పనిచేస్తున్న.. ఉద్యోగులకు టీసీఎస్ చివరి హెచ్చరిక

వర్క్ ఫ్రం హోంపై టెక్ దిగ్గజం టాటా కన్సల్టేన్సీ (TCS) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఇంటినుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు అల్టీమేట్ జారీ చేసింది. మార్చి చివరి నాటికి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని మెసేజ్ పంపించింది. ఉద్యోగులు ఆఫీసునుంచి పనిచేయాల్సిన గడువు ను వచ్చెనల వరకు పొడిగించనప్పటికీ ఇది చివరి గడువు అని.. ఆఫీసుకు రాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వర్క్ ఫ్రం హోం తో అటు ఉద్యోగులు, ఇటు సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్రమణ్యం చెప్పారు. 

టీసీఎస్ తన ప్రీ పాండమిక్ వర్క్ కల్చర్ కు తిరిగి రావాలని.., కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి దూరం ఉండాలని యోచిస్తుందని సుబ్రమణ్యం తెలిపారు. 2025 నాటికి నాల్గవ వంతు మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తారని కంపెనీ మొదట ప్రకటించింది. కానీ ఇప్పుడు వారు ఉద్యోగులందరిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరుతోంది. 

కాగా ఇటీవలి త్రైమాసికాల్లో టీసీఎస్ తమ ఉద్యోగులను తొలగింపు చేపట్టింది. అట్రిషన్ రేట్లు కూడా హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి దాని సాధారణ ఆపరేటింగ్ మోడ్ కు తిరిగి రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయడం ఈ ప్రణాళికలో కీలకమైన అంశం. దీంతో తప్పని సరి ఉద్యోగులంతా మార్చి చివరి నాటికి ఆఫీసులనుంచి వర్క్ చేయాలని టీసీఎస్ ప్రకటించింది.