కేసీఆర్​కు చంద్రబాబు పరామర్శ

కేసీఆర్​కు చంద్రబాబు పరామర్శ
  • చిరంజీవి, భట్టి, ఆర్​ఎస్ ప్రవీణ్ కూడా

హైదరాబాద్‌‌, వెలుగు :  యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌‌ను టీడీపీ చీఫ్​ చంద్రబాబు సోమవారం పరామర్శించారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పారు.

ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవ కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కేసీఆర్ పరిస్థితి తెలిశాక ఆయనతో ఓసారి మాట్లాడాలని అనిపించింది. అందుకే ఇవాళ ఆస్పత్రికి వచ్చాను. కేసీఆర్ కోలుకోవాలని కోరుకుంటున్నాను”అని చంద్రబాబు అన్నారు.

కేసీఆర్​ను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్​  త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​కూడా కేసీఆర్​ను పరామర్శించారు. 
 
చిరంజీవి పరామర్శ

కేసీఆర్​ను యాక్టర్ చిరంజీవి సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఆరోగ్యంగా,  హుషారుగా ఉన్నారని, 6 వారాల్లో కోలుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారన్నారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఇండస్ట్రీ ఎలాఉంది అని కేసీఆర్​ ఈ సమయంలో కూడా అడిగారని చిరంజీవి చెప్పారు.

బీఆర్​ఎస్​నేత మానవతా రాయ్​ ​నేతృత్వంలో​ ఓయూ, కేయూ జేఏసీ విద్యార్థులు కేసీఆర్​ను పరామర్శించేందుకు రాగా, అదే టైంలో చంద్రబాబు రావడంతో ఆయనను ను పోలీసులు అడ్డుకున్నారు.