గుండెపోటుతో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

గుండెపోటుతో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో మృతిచెందారు. థాట్రాజ్ కు గుండెపోటు రావడంతో వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి థాట్రాజ్ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ ను వీడి.. టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, కుల వివాదం కారణంగా ఆయన నామినేషన్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు జనార్ధన్ థాట్రాజ్ స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం. థాట్రాజ్ మృతితో కురుపాం నియోజకవర్గంలో విషాధచాయలు అలుముకున్నాయి. థాట్రాజ్ మృతిపట్ల, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కళా వెంకట్రావ్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

For More News..

భార్య చనిపోయిన కాసేపటికే భర్త సూసైడ్

24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు

టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్ గా తేల్చిన వైద్య సిబ్బంది!