టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తున్నాం: చెప్పేసిన పవన్ కల్యాణ్

టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తున్నాం: చెప్పేసిన పవన్ కల్యాణ్

ఏపీ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తామని.. పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడతామని.. కలిసి పోటీ చేస్తామని తెలిపారు. 2023, సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసి.. బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు పవన్ కల్యాణ్.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలన్నా.. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించాలన్నా ఇదొక్కటే మార్గం అన్నారు. ఏపీలో దోపిడీ రాజ్యం నడుస్తుందని.. లిక్కర్, ఇసుక మాఫియాతోపాటు డ్రగ్స్ మాఫియా వెనక వైసీపీ నేతలు ఉన్నారనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయని.. బీజేపీ వచ్చినా రాకపోయినా.. జనసేన పార్టీ మాత్రం.. టీడీపీతో కలిసి పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. 

ఏపీలో యుద్ధం మాత్రమే చేస్తామని.. జగన్ తో యుద్ధం చేస్తామన్నారు. జగన్ పై ఇక యుద్ధమే చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. అప్పుడు వైసీపీ నేతలు ఎవర్నీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. చంద్రబాబును రిమాండ్ కు పంపించినప్పుడు.. మీకు ఎలాంటి గతి పడుతుందో ఊహించుకోండి అంటూ హెచ్చరించారు పవన్ కల్యాణ్.