
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో మరో అరగంటలో చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులతో చంద్రబాబు సమావేశమవుతారు.
సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను భేటీ కానున్నారు బాబు. చంద్రగిరిలో రీపోలింగ్, ఇతర అంశాలను… ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్‌యాదవ్, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను ఆయన కలవనున్నారు. ఆ తరువాత లక్నో వెళ్లి బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతితో బాబు సమావేశమవుతారు.