
గచ్చిబౌలి, వెలుగు : ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మధ్యంతర బెయిల్పై రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన చంద్రబాబు.. హెల్త్ చెకప్ కోసం సిటీకి వచ్చిన సంగతి తెలిసిందే.గురువారం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు.
గ్యాస్ర్టోఎంటరాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ డాక్టర్ల బృందం చంద్రబాబుకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు చంద్రబాబును డిశ్చార్జ్ చేశారు.