
నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ వలన తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి అవమానంగా ఉందని, TDP రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని డీజీపీకి రిపోర్ట్ చేసిన సందర్బంలో అన్నారు.
నా ఫేస్ బుక్ ఐడి కాకుండా యామిని పేరుతో నకిలీ ఐడి క్రియేట్ చేసి తన ఫోటో, చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ ఫొటోల బొమ్మలు పెట్టి ఆసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఈ విషయం పై గతంలో రెండు, మూడు నెలల క్రితం పోలీస్ కంప్లైంట్ చేసినప్పటికీ, అసభ్యకర పోస్టులు ఆగలేదన్నారు. నిన్న(ఆదివారం) రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి, ప్రధాన మంత్రి ఫొటోలతో అసభ్యకరంగా పోస్టులు పెట్టి తనకి అపవాదు తెస్తున్నారని.. జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇచ్చి మహిళను హోమ్ మంత్రి చేశారని అన్నారు. అవసరం అనుకుంటే, స్వయంగా ఈ విషయాలను జగన్మోహన్ రెడ్డి గారిని కలసి మాట్లాడతానని, సైబర్ చట్టాలను మరింత కఠిన తరం చెయ్యలను కొరతానని ఆమె కోరారు.