రణరంగంగా తిరువూరు టీడీపీ ఆఫీసు.. గాల్లోకి కుర్చీలు.. తలలు పగిలాయి

రణరంగంగా తిరువూరు టీడీపీ ఆఫీసు.. గాల్లోకి కుర్చీలు.. తలలు పగిలాయి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తిరువూరు టీడీపీ కార్యాలయం వద్ద రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో స్థానిక ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి.

అన్నదమ్ముల మధ్య వర్గపోరు బహిరంగంగానే సాగింది. తిరువూరులో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈనెల 7న చంద్రబాబు సభ ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్థానిక నేతలతో సమన్వయం చేయడానికి నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొనటానికి కేశినేని నాని, కేశినేని చిన్ని తిరువూరు వెళ్లారు. అయితే ఫ్లెక్సీలో కేశినేని నాని ఫొటో లేకపోవడంతో నాని వర్గం ఫ్లెక్సీలు చించి, కుర్చీలను విరగొట్టి ఆందోళనకు దిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ దత్తుపై కూడా నాని వర్గం ఆందోళనకు దిగింది.

ఈ నెల 7న తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ( జనవరి 3) సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ ఈ ఫ్లెక్సీల్లో కేశినేని నాని ఫొటో లేదు. చిన్ని ఫొటోలు ఉండటంతో నాని వర్గం నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని చిన్నికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. చిన్ని ఫ్లెక్సీలను చించివేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. కేశినేని చిన్నికి కార్యాలయంలోకి రానివ్వమంటూ నాని వర్గం అయితే ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో స్థానిక ఎస్సై తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. జై చిన్ని, జై నాని అంటూ పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వంద మందితో బైక్ ర్యాలీగా కేశినేని నాని వచ్చారు. వచ్చిన వెంటనే నాని పొటో చిన్నదిగా వేశారంటూ నాని అనుచరులు పోస్టర్లు చించి, కుర్చీలు విసిరి రభస చేశారు. కొద్దిసేపటికి వేలాదిమందితో కేశినేని చిన్ని ర్యాలీగా వచ్చారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ దశలో పార్టీ కార్యాలయంలోని రూంలో ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలని కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేశారు.