పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ..

పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన టీడీపీ ఎంపీ..

18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాల్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నేతృత్వంలో ఎంపీలు ప్రమాణం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పంచకట్టులో సమావేశాలకు హాజరై తెలుగులో ప్రమాణం చేసి ఆకట్టుకోగా విజయనగరం నుండి గెలుపొందిన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తమ పార్టీ గుర్తైన సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

గెస్ట్ హౌస్ నుండి సైకిల్ పై వెళ్లిన అప్పలనాయుడు తెలుగులో పరిమాణం చేశారు. పసుపు లాల్చీ, పంచకట్టులో ఆకట్టుకున్నారు అప్పలనాయుడు.ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లు తెలుగులో ప్రమాణం చేశారు.