ఒంటిమిట్టలోనూ టీడీపీ వన్ సైడ్ విక్టరీ

ఒంటిమిట్టలోనూ టీడీపీ వన్ సైడ్ విక్టరీ

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒంటిమిట్ట జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీకి విక్టరీ వన్ సైడ్ గా వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి బరిలోకి దిగగా.. వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేశారు.

టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12 వేల 505 ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి కేవలం 6 వేల 351 ఓట్లు మాత్రమే వచ్చాయి.వైసీపీ అభ్యర్థిపై.. టీడీపీ అభ్యర్థి 6 వేల 267 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు.

ఒంటిమిట్ట జడ్పీటీసీ విజయంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.పులివెందుల, ఒంటిమిట్ట విజయంతో టీడీపీలో జోష్ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాయలసీమ గడ్డపై జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసింది.

ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ వైసీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవటం టీడీపీ నేతలు, కార్యకర్తలకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.

జగన్ సొంత జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడంతో టీడీపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది.ఈ ఫలితాలు జగన్ పై వ్యతిరేకతకు నిదర్శనం అని.. ప్రజాస్వామ్యం గెలిచింది అంటోంది టీడీపీ. 30 ఏళ్లుగా జగన్ అరాచకాలకు జనం ఇచ్చిన తీర్పు అంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. 

పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ గెలుపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకొచ్చామంటున్నారు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. వైసీపీ రప్పా రప్పా బ్యాచ్ ఇప్పుడు ఎక్కడికి పోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. జగన్ ఇక పార్టీని మూసేసుకోవటమే బెటర్ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు టీడీపీ నేతలు.