టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు : చంద్రబాబు

టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు : చంద్రబాబు

ఏపీలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబునాయుడు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్రంలో 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 110 అసెంబ్లీ స్థానాలతో తమ గెలుపు ఖాయమన్నారు. నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొందరు మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందన్నారు.

మరోవైపు ముందుగా వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్ తో రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని, 22న కౌంటింగ్ ప్రక్రియపై అందరికీ మరోసారి ట్రైనింగ్ ఇస్తామన్నారు. వీవీపాట్ల లెక్కింపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.